Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిషపై మన్సూర్ అనుచిత వ్యాఖ్యలపై ఖుష్బూ ఆగ్రహం

Kushboo sundar demands apology from mansoor alikhan over his comments on trisha
Advertisement
  • త్రిషతో రేప్ సన్నివేశం లేనందుకు విచారంగా ఉందన్న నటుడు మన్సూర్ 
  • నటికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు, సారీ చెప్పనని తెగేసి చెప్పిన మన్సూర్
  • మన్సూర్ తీరుపై మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు ఆగ్రహం
  • వివాదం నుంచి తప్పించుకోలేరని వార్నింగ్
Advertisement
నటి త్రిషతో అత్యాచారం సీన్ మిస్సయ్యానంటూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేసి, క్షమాపణ చెప్పేందుకు కూడా నిరాకరిస్తున్న నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని తీరును ఖండించారు. 

‘‘ఇలాంటి వ్యక్తులు.. పక్కవాళ్లు చేసిన తప్పులను ఎత్తి చూపించి తాము చేసినదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. మన్సూర్ అలీ ఖాన్.. ఎదుటివాళ్లను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తోంది. క్షమించండి...ఈ వివాదం నుంచి మీరు బయటపడలేరు. క్షమాపణలు చెప్పడంతో మీరేమీ తగ్గిపోరు. కానీ, మీ ఇంట్లో ఉండే మహిళలకు గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. సినిమాల్లో పోషించిన పాత్రలనే నిజ జీవితంలోనూ మీరు ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తోంది’’ అని ఖుష్బూ ట్వీట్ చేశారు. 

త్రిష, విజయ్ జంటగా నటించిన లియో మూవీ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీలో మన్సూర్ అలీ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గతంలో ఎన్నో రేప్ సీన్స్‌లో నటించా. లియోలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అది లేకపోవడం నన్ను బాధించింది’’ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, త్రిషకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా మన్సూర్ మాత్రం ససేమిరా అంటున్నారు.
Advertisement
Advertisement
Kushboo
Trisha
Mansoor Ali Khan
Kollywood
Tollywood

More Telugu News